మహీ కొత్త కారు చూశారా ?

గత వారం చివర్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఇండియాకు ఎన్నో విజయాలను అందించిన ఎంఎస్ ధోనీ, ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇక, వాహనాలపై ఎంతో ప్రేమను కనబరిచే ధోనీ, రిటైర్ మెంట్ తరువాత, ఓ వింటేజ్ కారును ఇంటికి తీసుకుని వచ్చారట. ఓ వేలంలో దాన్ని కొనుగోలు చేసిన ధోనీ, స్వయంగా నడుపుకుంటూ ఇంటికి తేగా, అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య సాక్షి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాగా, ఇప్పటికే ధోనీ గ్యారేజ్ లో పలు వాహనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వాటికి అదనంగా తాజాగా ‘పోంటియాక్ ఫైర్ బర్డ్ ట్రాన్స్ ఏఎం’ వచ్చి చేరిందని సాక్షీ సింగ్ తెలిపారు. ఇదిలావుండగా, ఇది 1970 మోడల్ కారు. ఇండియాలో చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి. ఎడమచేతి వైపు ఇంజన్ ఉండే కారులో 455 సీసీ ఇంజన్ ఉంటుంది. రెండు డోర్లతో వచ్చే ఈ కారు ధర సుమారు రూ. 60 లక్షల వరకూ పలికి ఉండవచ్చని అంచనా. 

ReplyForward