చిత్రసీమ లో వరుస మరణాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఎవరు ఒకరు మరణిస్తూ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నారు. ఆదివారం రాత్రి సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ కన్నుమూశారు. రాత్రి 8.50ని.ల సమయంలో ఆయనకి గుండెపోటు రావడంతో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి తెలుగు, తమిళ పరిశ్రమలకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
సత్యనారాయణ పాండురంగ మహత్యం అనే తొలి డబ్బింగ్ సినిమా రూపొందించారు. గత కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ‘కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయా మోహిని’ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మొత్తం 40 చిత్రాలకు పైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.