లేడీ ఓరియంటెండ్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి తెచ్చుకున్న అనుష్క..సైజ్ జీరో తర్వాత ఒక్కసారిగా డౌన్ అయ్యింది. విపరీతంగా లావు పెరగడం తో ఆఫర్స్ తగ్గిపోయాయి. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఓ ఓటిటి సంస్థ భారీ ఆఫర్ చేయగా దానికి నో చెప్పిందట .
ప్రస్తుతం తనకి వెబ్ సిరీస్ లలో నటించాలన్న ఆసక్తి లేదని నో చెప్పారట. అయితే నెట్ ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ ను భారీ గానే తియ్యాలని ప్లాన్ చేశారట. అందులోనూ అన్ని కీలక భాషల్లోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి కాస్త ఆలోచించుకొని సినిమాకు ఓకే చెపితే బాగుంటుందని ఆమె సన్నిహితులు , సినీ ప్రముఖులు చెపుతున్నారట.