Site icon TeluguMirchi.com

భారత్ లో కరోనా కేసులు ఏ సంఖ్య కు చేరాయో తెలుసా..?

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు లక్షలు పెరుగుతున్నాయి. వైరస్ మొదట్లో కేంద్రం కట్టడి చేయడంలో సక్సెస్ అయినా ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం తో కేసులు భారీగా పెరగడం స్టార్ట్ అయ్యాయి.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుద‌ల చేసిన క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం ..దేశంలో పాజిటివ్ కేసులు 12 లక్షల మార్క్‌ కు దగ్గర పడింది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 37,724 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక‌ 24 గంట‌ల్లో క‌రోనా బారిన‌ ప‌డి 648 మంది మృతిచెందారు.. దీంతో.. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కు చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 28,732 మంది మృతిచెందారు..

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 411133 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 7,53,050 మంది పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌, క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కూడా క్ర‌మంగా పెరుగుతున్నాయి.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,47,24, 546 టెస్టులు చేసిన‌ట్టు ఐసీఎంఆర్ ప్ర‌క‌టించింది.

Exit mobile version