భారత్ లో ఇప్పటివరకు కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయంటే

దేశంలో కరోనా ఉదృతి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుం రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండడం తో కేంద్రానికి ఏంచేయాలో అర్ధం కావడం లేదు. గత 24 గంటల్లో 34884 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1038716కి చేరింది. అలాగే… నిన్న ఒక్క రోజే 671 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 26273కి పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో మరణాల రేటు 2.5గా ఉండగా…. ప్రపంచవ్యాప్తంగా ఇది 7గా ఉంది. అంటే… ప్రపంచ దేశాలతో పోల్చితే… ఇండియాలో కరోనా మరణాలు కాస్త తక్కువగానే నమోదవుతున్నాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే..శుక్రవారం నాడు కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కి చేరింది. ఇక శుక్రవారం నాడు కరోనా నుంచి కోలుకుని 1,410 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 28,705 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి.