Site icon TeluguMirchi.com

బిగ్ బాస్ 4 సెలెక్షన్స్ ఎలా జరిగాయో తెలుసా..?

నార్త్ లో సూపర్ హిట్ అయినా బిగ్ బాస్ షో..సౌత్ లో కూడా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో నాల్గో షో మొదలుకానుంది. రీసెంట్ గా ఈ సీజన్ కు సంబందించిన కామింగ్ సూన్ ప్రోమో కూడా రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కదా ఈ షో నిర్వాహకులు ఎలా బిగ్‌బాస్ 4ను ఎలా నిర్వ‌హించ‌నున్నారు. అనే సందేహం అందరిలో కలుగుతుంది.

అయితే నిర్వాహ‌కులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకునే కంటెస్టెంట్స్‌ను ఎంచుకున్నార‌ని స‌మాచారం. కంటెస్టెంట్స్‌ను ఆపీసుల‌కు ర‌ప్పించ‌కుండా జూమ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి నిర్వాహ‌కులు మాట్లాడారట‌. అలాగే గ‌తసారిలాగా.. బిగ్‌బాస్ ఎక్కువ రోజులు కాకుండా 50 నుండి 60 రోజులు ఉండేలాగానే ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌భుత్వ విధి విధానాల‌కు లోబ‌డే ఈ సీజ‌న్‌ను త‌గినట్లు, ప్రేక్ష‌కుల‌ను మెప్పించే అంశాలుండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Exit mobile version