ప్రవీణ్ కు కింగ్ ఓకే చెప్పాడా..?

గత రెండేళ్లు గా హిట్ లేని కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ తో పాటు బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ రెండు చిత్రాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఈ రెండే కాక తాజాగా మరో చిత్రానికి నాగ్ ఓకే చెప్పాడనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. గరుడ వేగతో ఆకట్టుకున్న క్రేజీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం.

నాగార్జున ఇమేజ్‌కు తగ్గ ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ప్రవీణ్ నేరేట్ చేసాడట. ఈ స్టోరీ విని నాగ్ కూడా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.