ప్రభాస్ 21 లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త అధికారికంగా రావడం తో అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా కోసం దీపికా పదుకొనేకు భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్టు కోసం దీపికా పదుకొనే రూ.30 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది టాప్ స్టార్లు తీసుకుంటున్న దాని కంటే ఎక్కువ కావడంతో..ఓ హీరోయిన్ కు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం అనవసరమని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్ . ఇదే సినిమాకు ప్రభాస్ కు కేవలం రూ. 30 కోట్లు మాత్రమే ఇవ్వడం తో ప్రభాస్ అభిమానులు దీపికా కంటే తక్కువా అని ఫీల్ అవుతున్నారు.