మెగాస్టార్ చిరంజీవి వెండితెర ఫై మాత్రమే కాదు నిజ జీవితంలోను మెగాస్టారే. ప్రజలు ఆపదలో ఉన్నారంటే చాలు తనవంతు ఆర్ధిక , మాట సాయం చేస్తుంటాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న చిరు ..తాజాగా ప్లాస్మా దానం చేయాలని కోరారు.
కోవిడ్ 19 బారి నుండి కోలుకున్న పేషెంట్స్ ముందుకు వచ్చి ప్లాస్మా దానయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కష్ట కాలంలో ఇంత కన్నా గొప్ప మానవత్వం ఉండదు . కోవిడ్ -19 వారియర్స్, ఇప్పుడు సేవియర్స్గా ఉండాలని చిరు పేర్కొన్నారు. కోవిడ్ 19 నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్ పోలీసులు పిలుపునివ్వగా దానిని రీ పోస్ట్ చేస్తూ ప్లాస్మా దానం చేసి జీవితాలు కాపాడండి అని చిరంజీవి కోరుతున్నారు.
Humbly appeal to all RECOVERED Covid-19 patients to come forward & DONATE PLASMA to SAVE LIVES. There can be no greater humanitarian gesture in these times of unprecedented crisis. Covid-19 Warriors, Be Saviors Now! https://t.co/InPwNsoZ3q@TelanganaDGP @TelanganaCOPs https://t.co/090pxOvVcw— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2020