Site icon TeluguMirchi.com

ప్రగతి తో స్టార్ కమెడియన్ చేయరాని పని చేసాడట

సీనియర్ నటి ప్రగతి తెలియనివారుండరు..హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈమె..ప్రస్తుతం తల్లి పాత్ర ల్లో ఎక్కువగా నటిస్తూ వెండితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెరపై అమ్మ పాత్రలో కనిపించినప్పటికీ..సోషల్ మీడియా లో మాత్రం తనలోని గ్లామర్ యాంగిల్ ను చూపిస్తూ నెటిజన్లను నిద్ర లేకుండా చేస్తుంటుంది. తాజాగా ఇంటర్వ్యూ లో స్టార్ కమెడియన్ చేసిన పని గురించి చెప్పి షాక్ ఇచ్చింది.

టాలీవుడ్‌లో పేరు మోసిన కమెడియన్ ఒకరు తనతో మిస్ బిహేవ్ చేసాడని.. అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన విషయం బయటపెట్టింది ప్రగతి. ఈ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు చెప్పింది ఈ సీనియర్ నటి. కమెడియన్ పేరు అయితే చెప్పలేదు కాని చాలా ఎక్స్‌ట్రాలు మాత్రం చేసాడని చెప్పుకొచ్చింది ఈమె. ఆ సమయంలో ఆయన చాలా పెద్ద స్టార్ కమెడియన్ అని.. ఏడాదికి 20,30 సినిమాలు చేస్తున్నాడని చెప్పింది.

తనతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో తనను కావాలని ఇబ్బంది పెట్టాడని.. పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో పాటు ముట్టుకోడానికి ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. అతడి మాటలు చేష్టలు తనకు చాలా ఇబ్బందిని కలిగించాయని.. అందుకే విషయం చాలా దూరం వెళ్లకుండా వెంటనే తాను అతడితో మాట్లాడానని చెప్పింది.

Exit mobile version