పెళ్లి కి రావాలంటూ కేసీఆర్ కు నితిన్ పిలుపు

హీరో నితిన్ పెళ్లి ఈనెల 26 సాయంత్రం 8గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరగబోతున్న సంగతి తెలిసిందే. నితిన్‌-షాలిని వివాహ వేడుక ఏప్రిల్ 16న జ‌ర‌గాల్సింది. క‌రోనా వైర‌స్, లాక్‌డౌన్‌ కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ నెల 22 నుండి శ్రావణ మాసం మొదలుకాబోతుండడం తో ఈ నెల 26 వీరి పెళ్లిని ఫిక్స్ చేసారు ఇరు కుటుంబ సభ్యులు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావుని క‌లిసి వివాహ ప‌త్రికతో స్వ‌యంగా పెళ్లికి ఆహ్వానించారు నితిన్‌. ఇదివ‌ర‌కే కరోనా వైర‌స్‌తో పోరాడేందుకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 లక్షల చెక్‌ని నితిన్ నేరుగా కేసీఆర్‌కు అందజేశారు.