పెళ్లా..వామ్మో అంటున్న హాట్ బ్యూటీ

అవును , సీమటపాకాయి చిత్రాలతో అలరించిన పూర్ణ ..పెళ్లి మాట ఎత్తితే వామ్మో అంటుంది. పెళ్లి పేరుతో ఇటీవ‌ల ఓ ముఠా ఆమెను మోసం చేసిన వ్య‌వ‌హారం సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయిన విష‌యం తెలిసిందే. మోస‌గాళ్ల‌ను క‌ట‌క‌టాల పాలు చేశారు. ఈ నేప‌థ్యంలో పెళ్లంటేనే పూర్ణ‌కు అస్సలు నచ్చడం లేదు.

ఈ సంద‌ర్భంగా పూర్ణ మాట్లాడుతూ పెళ్లిపై త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. త‌న‌కు పెళ్లి చేసేందుకు త‌ల్లిదండ్రులు వ‌రుడి కోసం వెతుకులాట మొద‌టు పెట్టార‌న్నారు. ఇదే సంద‌ర్భంలో ఓ ముఠా త‌న త‌ల్లిదండ్రుల‌ను సంప్ర‌దించింద‌న్నారు. ఇరువైపుల పెద్ద‌లు మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేశాయ‌న్నారు. పెళ్లి అనంత‌ర జీవితం గురించి చ‌ర్చించేందుకు కాబోయే వాడితో చ‌ర్చించిన‌ట్టు పూర్ణ తెలిపారు.

ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు త‌న‌కు షాక్ ఇచ్చాయ‌న్నారు. ఆ ముఠా త‌మ‌తో ప్రేమ‌గా, అభిమానంగా వ్య‌వ‌హ‌రించి తీవ్ర మోసం చేసిన‌ట్టు పూర్ణ ఆవేద‌న‌తో చెప్పుకొచ్చింది. ఆ విష‌యం గురించి ఆలోచిస్తేనే భ‌య‌మేస్తుంద‌న్నారు. అస‌లు ఎవిరిని న‌మ్మాలో, ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో అర్థం కావ‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేసింది.