పాయల్ ..లిప్ లాక్ సీన్స్ గురించి ఫస్ట్ ఆమెకు చెపుతుందట..

RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , నెటిజన్లను అలరిస్తూ వస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. పాయల్ నటించినా ప్రతి సినిమాలో లిప్ లాక్ తప్పనిసరి..దాని గురించి అడుగగా.. నేను చేసే ఏ సినిమాలోనైనా సరే లిప్ లాక్ సీన్స్ ఉంటె ముందుగా వెళ్లి మా అమ్మను అడుగుతా… ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అందులో నటిస్తా” అని తెలిపింది. ఇక పాయల్ ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించనున్నట్లు వినికిడి.