రామ్ గోపాల్ వర్మ..ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యముగా తన సినిమా ప్రమోషన్ విషయంలో ఈయన చేసే హడావిడి మాములుగా ఉండదు..చాలామంది తమ సినిమా ప్రమోషన్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు . కానీ వర్మ మాత్రం జస్ట్ ఫ్రీ ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా ఈయన తెరకెక్కించిన పవర్ స్టార్ విషయంలోనూ అదే చేస్తున్నాడు. ఒక్కో పోస్టర్ , స్టిల్ సినిమా ఫై విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేస్తున్నాడు.
‘పవర్‌స్టార్’ సినిమాను ఈ నెల 25 న విడుదలకు సిద్ధం చేశారు. కాగా ప్రమోషన్ లో భాగంగా బుధవారం 11 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ.. అంత కంటే ముందుగానే ట్రైలర్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఈ ట్రైలర్ కోసం వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తానని వర్మ తెలిపారు. అయితే ఈ విషయాలను గమనిస్తున్న కొంతమంది.. ట్రైలర్ లీక్ కావడం అనే విషయం వర్మ పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనని, వర్మ ఇలాంటి వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించినప్పుడు లేని లీకుల సమస్య.. ఇప్పుడెలా వచ్చింది? అని ప్రశ్నిస్తున్నారు. తన ‘పవర్‌స్టార్’ సినిమాకు హైప్ తెచ్చుకోవడం కోసమే వర్మ ఈ లీక్ ట్రిక్ ప్లే చేశాడే తప్ప మరేం లేదని తేల్చి చెపుతున్నారు. వర్మ ఏంచేసినా గాని సినిమా కు మాత్రం ఈ ట్రైలర్ తో విపరీతమైన క్రేజ్ వచ్చిందని అంత అంటున్నారు