వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు. దీంతో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వర్మ సైతం ఓ యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ యాప్ కి ఆర్ జి వి వరల్డ్ థియేటర్ అనే పేరును పెట్టుకున్నాడు.
ఇప్పటికే ఆ యాప్ లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేసాడు. కాగా ఇప్పుడు ఆయన ‘పవర్ స్టార్’ సినిమా జూలై 25న ఉదయం 11 గంటల నుంచి www.rgvworldtheatre.com థియేటర్లో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా పవన్ చంద్రబాబు , చిరంజీవి లాంటి డూపులు ఇప్పటికే వర్మ తన పోస్టర్స్ ద్వారా పరిచయం చేసాడు . . తాజాగా ‘పవర్ స్టార్’ సినిమాలో ఓ క్యారెక్టర్ అంటూ… అతడు ఎవరి పోలికతో అయినా ఉన్నాడా అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటో చూసిన చాలామంది ఇంకెవరు మన బండ్ల గణేశే అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద పవన్ కు దగ్గరి వారినందరిని వాడుకున్నాడు అనిపిస్తుంది.