వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు. దీంతో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వర్మ సైతం ఓ యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ యాప్ కి ఆర్ జి వి వరల్డ్ థియేటర్ అనే పేరును పెట్టుకున్నాడు.
ఇప్పటికే ఆ యాప్ లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేసాడు. కాగా ఇప్పుడు ఆయన ‘పవర్ స్టార్’ సినిమా జూలై 25న ఉదయం 11 గంటల నుంచి www.rgvworldtheatre.com థియేటర్లో స్ట్రీమింగ్ కాబోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా పవర్ స్టార్ ట్రైలర్ ను బుధువారం యూట్యూబ్ లో లీక్ అయ్యింది. వాస్తవానికి ఈ ట్రైలర్ ను చూడాలంటే రూ. 25 చెల్లించాలని వర్మ ప్రకటించాడు కానీ..ఇప్పుడు ఆ ఖర్చు లేకుండానే యూట్యూబ్‌లో ‘పవర్‌స్టార్’ ట్రైలర్ లీకైంది. నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దీనిపై వర్మ స్పందించారు. ”పవర్‌స్టార్ ట్రైలర్ లీక్ కావడం వల్ల గంటలో అఫీషియల్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేస్తామన్నారు. అంతేకాకుండా ట్రైలర్‌కి డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని తెలిపారు”.