వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు. దీంతో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వర్మ సైతం ఓ యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ యాప్ కి ఆర్ జి వి వరల్డ్ థియేటర్ అనే పేరును పెట్టుకున్నాడు.
ఇప్పటికే ఆ యాప్ లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేసాడు. కాగా ఇప్పుడు ఆయన ‘పవర్ స్టార్’ సినిమా జూలై 25న ఉదయం 11 గంటల నుంచి www.rgvworldtheatre.com థియేటర్లో స్ట్రీమింగ్ కాబోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్రంలోని గడ్డి తింటావా అనే సాంగ్ రిలీజ్ చేసి హల్చల్ చేసాడు వర్మ.
ఈ పాటను యూట్యూబ్లో 75 వేల మంది లైక్ చేయగా.. 60 వేల మంది డిజ్లైక్ చేశారు. అయితే, తన సినిమాలోని పాటకు 17 లక్షల వ్యూస్ రావడం పట్ల వర్మ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అంకితం ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయం @PrawanKalyan ఫ్యాన్స్ కి అంకితం ???
స్పెషల్ థాంక్స్ టు @PrawanKalyan ఫ్యాన్స్ ??? Watch Trailer tmrw at 11 AM in @rgvworldtheatre by paying Rs 25/- per view https://t.co/hoteeBX46D pic.twitter.com/FTXZjA4HvV— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2020