ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రతరం అవుతుండడం తో పలు నగరాలు స్వచ్ఛదంగా లాక్ డౌన్ చేపడుతున్నాయి. నెల్లూరు నగరంలో రేపటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు షాపులకు అనుమతి ఉంటుంది.
మెడికల్ షాపులు, పాల బూత్‌లకు సాయంత్రం వరకు అనుమతి ఇస్తారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో లాక్ డౌన్ అమలవుతోంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 3010 కరోనా కేసులు ఉన్నాయి. 2000 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 22 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.