Site icon TeluguMirchi.com

నితిన్ పెళ్లి డేట్ ఇదే..

కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బ కు ఇంట్లోనుండి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇతర దేశాల్లో ఎక్కువగా గడిపే వారు సైతం ఎలాంటి టూర్స్ ప్లాన్ చేయడం లేదు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ నితిన్ పెళ్లి ఫై పడింది.

ఏప్రిల్ 16 న నితిన్ దుబాయి లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అంతటా ఉండడం తో పెళ్లి ని వాయిదా వేసుకున్నాడు. తాజాగా పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసారు కుటుంబ సభ్యులు . నితిన్, షాలినీల వివాహం జూలై 26 సాయంత్రం 8గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరపనున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరుకానున్నారని తెలిపారు.

Exit mobile version