సోషల్ మీడియా లో యంగ్ హీరో నిఖిల్ ఫై రామ్ గోపాల్ వర్మ అభిమానులు దాడికి దిగారు. ప్రస్తుతం వర్మ పవర్ స్టార్ టైటిల్ తో సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ మూవీ ఓటిటి లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భాంగా వర్మ చిత్ర ట్రయిలర్ ను రిలీజ్ చేసి ఆసక్తి తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించాడు.
పవన్ ను అభిమానించే నిఖిల్ సైతం..ట్రయిలర్ చూసాక వర్మ ఫై పరోక్షం గా ట్వీట్ చేసాడు. ”శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా’ అంటూ ట్వీట్ పెట్టారు. అయితే నిఖిల్ ట్వీట్‌ను చాలా లైట్ తీసుకున్న వర్మ.. నిఖిలా అతనెవరు.. అలాంటి వాళ్లు ఉన్నారనే సంగతి కూడా నాకు తెలియదు అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘‘నిఖిల్ కావచ్చు, కిఖిల్ కావచ్చు.. వాళ్లంతా ఒకే కోవకు చెందినవాళ్లు. వీళ్లంతా పవన్ కళ్యాణ్ కింద తొత్తులు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ కళ్యాణ్‌కు వీళ్లమీద మంచి అభిప్రాయం వస్తుందని వీళ్ల ఆశ. బానిసత్వం అనే బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్ ఎవడో నాకు తెలీదు. ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు.. కానీ నాకు తెలీదు’’ అని వర్మ తేల్చిపారేశారు.
వర్మ అభిమానులు మాత్రం నిఖిల్ ఫై ఓ రేంజ్ లో మాటల దాడి చేస్తున్నారు. ‘ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావ్.. వర్మతో పెట్టుకోవడం నీకు అవసరమా నిఖిల్.. బ్రదర్ నువ్ అంటే అభిమానం నాకు, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు.. ఇదే వర్మ పెద్ద ఎన్టీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు సినిమాలో చూపిస్తే మాట్లాడలేదు.. కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో బాలయ్య బాబు బిడ్డని నెగటివ్‌గా చూపిస్తే మాట్లాడలేదు ఎందుకు?
నీకు పవన్ ఫాన్స్ చాలా వేరే హీరో ఫాన్స్ అవసరం లేదా? ఇంతకీ ఇక్కడ కుక్క ఎవరూ?పావలనా లేక జీవినా? తెలుగోడు సత్తా ప్రపంచానికే చాటిన మన అన్న ఎన్టీఆర్ గారి మీద సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు మొరిగె కుక్కలు అప్పుడు మొరగలేదే? కలికాలం ఆంటే ఇదే మరి? నువ్వేమో ప్రచారం చేసింది టీడీపీ తరుపున ఇప్పుడేమో పవన్ కళ్యాణ్‌ని శిఖరం అంటున్నావ్.. అయినా వర్మతో నీకెందుకు ఆయన్ని కెలక్కు సామీ. నిక్కర్లో నిఖిల్ అని ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాడు.. తరువాత నువ్ పిసుక్కోవడమే.. పిల్లోడివి పిల్లోడిలా ఉండవయ్యా నిఖిల్ అంటూ ఓ రేంజ్లో నిఖిల్‌పై కామెంట్స్ చేస్తున్నారు.