ఛలో, భీష్మ వంటి చిత్రాలతో సూపర్ సక్సెస్ లు అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల..తాజాగా రాంచరణ్ కు కథ వినిపించగా..చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలు ఇలా ఉండగానే తాజాగా ఈ డైరెక్టర్ నానితో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెంకీ కథను వినిపించగా నానికి స్క్రిప్ట్ నచ్చినట్టు టాక్. అన్నీ కుదిరితే 2021 ప్రథమార్థంలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. మరి దీనిపై నాని నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.