గత రెండేళ్లు గా హిట్ లేని కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ తో పాటు బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ రెండు చిత్రాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఈ రెండే కాక తాజాగా మరో చిత్రానికి నాగ్ ఓకే చెప్పాడు. గరుడ వేగ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో నాగ్ ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ దాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా..శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై స్పష్టత రానుంది.