దీపికా అందుకే ప్రభాస్ కు ఓకే చెప్పిందా..?

ప్రభాస్ – నాగ అశ్విన్ కలయికలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ను ఫిక్స్ చేసారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి గ్రాండ్ వెల్ కం చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం అశ్విన్ మూవీ పనుల్లో బిజీ గా న్నాడు.

బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతూ బిజీ బిజీగా ఉన్న దీపికాకు తెలుగులో ఇదే మొదటి సినిమా కానుంది. అయితే దీపిక లాంటి బిగ్ హీరోయిన్ ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి ఓకే చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో చేసేందుకు దీపికా భారీ రెమ్యూనరేషన్ అడిగిందని..దానికి నిర్మాతలు ఓకే చెప్పడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.