సెప్టెంబరు ఏడో తేదీ నుంచి జరిగే శాసనసభ, మండలి సమావేశాలకు కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న రెండేసి సీట్లలో ఒక్కొక్కరే కూర్చునేలా నిబంధన విధించనుంది. ప్రస్తుతం శాసనసభలో ఒక సీటులో ఇద్దరేసి సభ్యుల చొప్పున 151 మంది సభ్యులు కూర్చునేలా సోఫాల్లాంటి 76 సీట్లు ఉన్నాయి.
ఒక దానిలో సీఎం కేసీఆర్ కూర్చుంటున్నారు. సభలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడితో కలిసి ఉండాల్సింది 120 మంది కాగా దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మృతి వల్ల ఆ సంఖ్య 119గా ఉంది. స్పీకర్ పోడియంపై కూర్చుంటారు.