అదేంటి అనసూయ ఆల్రెడీ ఇద్దరు పిల్లలకు తల్లి కదా మళ్లీ తల్లి పోస్ట్ కొట్టేయడం ఏంటి అని అనుకుంటున్నారా..ఇది నిజ జీవితం లో కాదులెండి..వెండితెర ఫై మాత్రమే. యాంకర్ గా , నటిగా తన సత్తా చాటుకుంటూ వస్తున్న అనసూయ..సోషల్ మీడియా లోను మిలియన్ల ఫాలోయర్స్ ను సొంతం చేసుకొని అలరిస్తుంది.
తాజాగా ఈమె దగ్గరికి తల్లి రోల్ ఛాన్స్ వచ్చిందట. సుశాంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న ఒక చిత్రంలో హీరో తల్లి పాత్రకు గాను అనసూయను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. మొదట ఆ పాత్రను ఇంద్రజతో చేయించాలని మేకర్స్ భావించారు. అయితే ఇంద్రజ ఇప్పట్లో హైదరాబాద్ రాలేను అంటూ చెప్పడంతో వారు అనసూయను సంప్రదించారట. హీరోలకు అమ్మ పాత్రలో ఇప్పటి వరకు అనసూయ చేయలేదు. కాని పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా సుశాంత్ కు అమ్మగా నటించేందుకు ఒప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా కదా అనేది అనునే చెప్పాలి.