సీత తో చిరాకు తెప్పించిన డైరెక్టర్ తేజ..రీసెంట్ గా రెండు ప్రాజెక్ట్ లను ప్రకటించాడు. ఒకటి గోపీచంద్ తో కాగా రెండోది రానా తో. గోపీచంద్ హీరోగా తెరకెక్కిస్తున్న అలిమేలుమంగ వెంకటరమణ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికే మూడు సార్లు తేజ దర్శకత్వం లో నటించిన కాజల్ మరోసారి నటించేందుకు ఒకే చెప్పింది. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేసిందట.
ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా ఫైనల్ చేశారట తేజ. పూర్తిగా పాత్ర బలంతో నడిచే కథ కావడంతో గోపీచంద్ కి కథ బాగా సూట్ అవుతుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే డిసెంబర్ నుండి ఈ సినిమా పట్టాలైక్కే అవకాశముంది. మొత్తానికి మరో పవర్ ఫుల్ రోల్ లో యాక్షన్ హీరో నటించబోతున్నాడు. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ‘సీటీమార్’ చేస్తోన్నాడు.