తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగులతో పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణల కోసం నిర్మాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. టూరిజం ప్రదేశాల్లో సినిమా షూటింగులపై వారంలోగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రణాళిక రూపొందించాక సీఎం కేసీఆర్ ను కలుస్తామని, వివరించారు.
లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘకాలం పాటు సినిమా, టీవీ షూటింగ్ లు నిలిచిపోగా, నిన్న కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. షూటింగులు జరుపుకునేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు టాలీవుడ్ సినీ పెద్దలు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిలిం చాంబర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.