బొమ్మరిల్లు చిత్రంలో హాసిని గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన జెనీలియా..తెలుగు లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను 2012లో వివాహం చేసుకొని చిత్ర సీమకు దూరం అయ్యింది. రితేశ్, జెనీలియా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ స్కూల్ కు వెళ్తుండడం .. రితేశ్ కు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడం తో జెనీలియా బిజినెస్ లోకి అడుగుపెట్టబోతుంది. అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ పుడ్స్ ఇనిస్టిట్యూట్ తో కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో ఇండియాలో బిజినెస్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్ధాలు తయారు చేసుకోవచ్చని ఈ సెలెబ్రిటీ కపుల్స్ చెప్తున్నారు.