జులై 25 న పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు..

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు. దీంతో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వర్మ సైతం ఓ యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ యాప్ కి ఆర్ జి వి వరల్డ్ థియేటర్ అనే పేరును పెట్టుకున్నాడు.

ఇప్పటికే ఆ యాప్ లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేసాడు. కాగా ఇప్పుడు ఆయన ‘పవర్ స్టార్’ సినిమా జూలై 25న ఉదయం 11 గంటల నుంచి www.rgvworldtheatre.com థియేటర్లో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. ఈ సినిమా పే ఫర్ వ్యూ పద్ధతిలోనే చూడాలని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే అప్సర రాణి నటించిన హిందీ మూవీ ‘థ్రిల్లర్’ కూడా ఈ థియేటర్ లో విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ లోగో కూడా రిలీజ్ చేసిన వర్మ.. ఇందులో విడుదల కాబోతున్న ఫస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ అని చెప్పుకొచ్చాడు.