విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో 74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా, అలాంటి గాయం మరెన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్న రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. వికేంద్రీకరణే సరైన విధానం అని నిర్ణయించి సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు