Site icon TeluguMirchi.com

జగన్ పై ఆర్ఆర్ఆర్ సైటర్లు

రాష్ట్రంలో కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. ఇటీవల వైకాపాతో విభేదిస్తూ వస్తున్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించారు.

‘‘ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలి. కరోనాపై చర్యలు తీసుకోవాలి. పథకాలన్నింటికీ జగన్‌ పేరు పెట్టుకోవడం అలవాటైంది. అలాగే జగనన్న కరోనా కేర్‌ అనో ఏ పేరైనా పెట్టుకోండి. కానీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలి. కులాలకు అతీతంగా జగనన్న కరోనా కంట్రోల్‌లో సభ్యులు ఉండాలి’’అని  సెటైరికల్ గా మాట్లాడారు. 

Exit mobile version