చెఫ్ గా మారిన యంగ్ హీరో ..

లాక్ డౌన్ కారణంగా సినీ నటీనటులంతా ఇంటికే పరిమితమైయ్యారు. ఇచక్కా కుటుంబ సభ్యులల్తో గడుపుతూ వంటిట్లో తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ చేతి వంటను కుటుంబ సబ్యులకు రుచి చూపించగా..తాజాగా బెల్లంకొండ గ‌ణేశ్ కూడా ఇంట్లో చెఫ్ అవ‌తార‌మెత్తారు.

‘ఇంట్లో నేను వంట చేయ‌డాన్ని మా కుటుంబ స‌భ్యులు త‌ప్పు ప‌ట్టలేదు. అమ్మాయిలే వంట చేయాల‌నుకునే త‌త్వం మా అమ్మానాన్నలకు లేదు. నేను యూఎస్‌లో ఎంఎస్ చ‌దివేట‌ప్పుడు, ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే స‌మ‌యంలోనూ స్వయంగా వంట చేసుకునేవాడిని. నేను ప్యూర్ వెజిటేరియ‌న్‌. మ‌ద‌ర్స్ డే రోజు మాత్రమే మా అమ్మ కోసం నాన్ వెజ్ వండుతాను. వంట చేయ‌డాన్ని స్ట్రెస్ బ‌స్టర్‌లా ఫీల్ అవుతాను’ అని చెప్పుకొచ్చాడు.