Site icon TeluguMirchi.com

ఘనంగా నితిన్ – షాలిని మెహందీ ఫంక్షన్

నితిన్ – షాలిని ఈ నెల 26 న ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలినిల ప‌సుపు, కుంకుమ వేడుక జ‌రిగింది. ఆ త‌ర్వాత పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో లాక్‌డౌన్ వ‌చ్చిప‌డింది. దీంతో ఆ శుభ‌కార్యం ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఎట్టకేల‌కు జులై 26 న ఒకటి కావాలని ఫిక్స్ అయ్యారు. ఈరోజు నితిన్ – షాలిని ల నితిన్ ఎంగేజ్మెంట్ జరిగింది.

ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పెళ్లి వేడుకలు బుధువారం నుంచే మొద‌ల‌య్యాయి. బుధ‌వారం హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వ‌హించాయి. ప‌రిమిత అతిథుల మ‌ధ్య ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. తాజాగా మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నితిన్‌ స్నేహితురాలు, ప్రముఖ స్టైలిస్ట్‌ డిజైనర్‌ కోన నీరజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వేడుకలో చేతులకు మెహందీ పెట్టుకున్న షాలిని.. రెడ్‌ కలర్‌ లెహంగాలో మెరిసిపోయారు. నితిన్‌ బ్లూ కలర్‌ కుర్తాలో కళ్లకు డిఫరెంట్‌ గాగూల్స్‌ పెట్టి స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు.

Exit mobile version