Site icon TeluguMirchi.com

గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన అలీ …

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొనగా..తాజాగానటుడు అలీ ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు .

బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు అలీ. ఎంపి సంతోష్ కుమార్ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలీ పేర్కొన్నారు. అనంతరం మరో ఇద్దరికి ఆయ‌న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. సోద‌రుడు, సినీ ఆర్టిస్ట్ ఖయుమ్, అలీ బావమరిది కరీంకు గ్రీన్ ఛాలెంజ్ చేప‌ట్టి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Exit mobile version