రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొనగా..తాజాగా గూగుల్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్…. మోకిలా ఈ ఛాలెంజ్ ను స్వీకరించింది.
తన నివాసంలో 14 మొక్కలు నాటి తన లింక్ డిన్ (LINK DIN) ఖాతాలో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని అరిజిత్ సర్కార్ గారు పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధురి దుగ్గిరాల సీనియర్ డైరెక్టర్ గూగుల్; రాహుల్ జిందాల్ డైరెక్టర్; హీనా రావల్ డైరెక్టర్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.