రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు.
ఇటీవల డైరెక్టర్ అజయ్ భూపతి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మణికొండలోని తన కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు, తనను గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామిని చేసిన డైరెక్టర్ అజయ్ భూపతికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరోలు నాని, రవితేజ, రాజశేఖర్‌ను గ్రీన్ ఇండియా భాగస్వామయ్యం కావాలని ఛాలెంజ్ విసిరారు.