కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాలో నటించిన వనితా మూడో పెళ్లి చేసుకుంది. తెలుగు లో పలు చిత్రాల్లో నటించిన ఈమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఆ తర్వాత అతనితో మనస్పర్థల రావడం తో అతడికి విడాకులు ఇచ్చి , 2005లో ఆకాశ్ నుండి విడిపోయింది.
ఆ తర్వాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే బిజినెస్ మేన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఆ తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఈమె పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత అంత ఈమెను తప్పుబడుతున్నారు. తాజాగా ఆమె గ్రామస్తుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది. చివరికి తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పింది.
పీటర్ పాల్‌ని మూడవ వివాహం చేసుకోగా, కొందరు దీనిని తప్పు పట్టారు. అయితే దానిని సమర్ధించుకునేందుకు ఈ అమ్మడు తన స్వస్థలాన్ని మధ్యలోకి తీసుకొచ్చింది. తంజూవురులో రెండో పెళ్లి కామన్. ఎంతో మంది చేసుకున్నారు. మా నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. పలు కారణాల వలన నేను మూడో పెళ్లి చేసుకోవలసి వచ్చింది. తంజావూరు సంప్రదాయం ప్రకారమే నేను వివాహం చేసుకున్నా అంటూ వితండవాదం చేసింది. దీనిపై తంజావూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు . ట్విట్టర్ వేదికగా ఆమెని ఎండగట్టారు. చేసేదేం లేక క్షమాపణలు చెప్పింది.