Site icon TeluguMirchi.com

కొల్లు రవీంద్రకు బెయిల్

సీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో ప్రమేయం ఉందంటూ… పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను జూలై నాలుగో తేదీన అరెస్ట్ చేశారు. విచారణలో పోలీసులు చురుకుగా లేకపోవడం… చార్జిషీటు ఇంకా దాఖలు చేయకపోవడంతో.. కొల్లు రవీంద్ర లాయర్లు కోర్టు నుంచి బెయిల్ సాధించగలిగినట్లుగా తెలుస్తోంది. బెయిల్ కోసం.. కొల్లు రవీంద్రకు మొత్తం 14 షరతులను కోర్టు పెట్టింది. 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని ఆదేశించింది.

Exit mobile version