గత కొన్ని రోజులుగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నటి నయనతార మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే వార్త మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసందే..ఎప్పటికప్పుడు మీడియా కంటపడుతున్న కానీ తమ ప్రేమ విషయాన్నీ మాత్రం చెప్పకుండా దాటవేస్తుంటారు. ఇక వీరి పెళ్లి కోసం అభిమానులు , సినీ ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ సైతం ఆసక్తి గా ఎదురుచూస్తుంది.
కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో ప్రచారం అవుతున్నాయి. వీరిద్దరూ అతి త్వరలోనే కేరళలోని ఓ గుడిలో వివాహం చేసుకోనున్నారని.. తక్కువ మంది బంధువులు మాత్రమే హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విఘ్నేష్ కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి పెంచడంతో నయన్ కూడా ఒకే అన్నట్లు తెలుస్తుంది.