కరోనా బారిన పడిన యాక్షన్ హీరో కూతురు

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి నడుస్తుంది. సామాన్య ప్రజలే కాక సినీ, రాజకీయ , బిజినెస్ , క్రీడా ఇలా అన్ని రంగాలవారు దీనిబారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ పడగ..తాజాగా యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య కరోనా బారినపడింది.

ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా నాకు క‌రోనా సోకిన‌ట్టు తేలింది. వైద్యుల స‌ల‌హాలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌లి కాలంలో నాతో ఎవ‌రైన కాంటిక్ట్‌లో ఉంటే వారు కూడా ఓ సారి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోండి. అంద‌రు క్షేమంగా ఉండండి, త‌ప్ప‌క మాస్క్ ధ‌రించండి. వీలైనంత త్వ‌ర‌లోనే నేను కోలుకుంటాను అని ఆశిస్తున్నాను ఐశ్వ‌ర్య పేర్కొంది. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా అంత్య‌క్రియ‌ల‌కి వెళ్లిన స‌మ‌యంలోనే ఐశ్వ‌ర్య‌కి క‌రోనా సోకింద‌ని అంటున్నారు.