తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృబన కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు సినీ తారలు దీనిబారిన పడలేదని అంత అనుకున్నారు. ఇప్పుడు వారు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.ఇప్పటికే వెండితెర స్టార్స్ , బుల్లితెర స్టార్స్ కు కరోనా సోకగా..తాజాగా డైరెక్టర్ తేజ సైతం దీనిబారిన పడ్డారు. గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం తేజ ముంబై వెళ్లినట్టు తెలుస్తుండగా, అక్కడ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.
తేజకి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో యూనిట్ సబ్యులతో పాటు ఆయన కుటుంబానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికి నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం తేజ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇటీవల తేజ కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.