Site icon TeluguMirchi.com

ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విలన్

అరుంధతి చిత్రంలో పశుపతి గా అందర్నీ మెప్పించిన సోను సూద్..రీసెంట్ గా వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా తన తల్లి జయంతి సందర్బంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

‘‘అమ్మా.. జీవితాంతం నాకు నువ్వు మార్గదర్శనం చేస్తూనే ఉండాలి. గట్టిగా హత్తుకుని.. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా మమ్మల్ని మిస్సవుతూనే ఉంటావని తెలుసు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అయితే నువ్వు ఎప్పటిలాగే నాకు దారి చూపే దేవతగా ఉండాలి. నిన్ను మళ్లీ కలిసేంత వరకు మిస్సవుతూనే ఉంటాను. హ్యాపీ బర్త్‌డే అమ్మా. మిస్‌ యూ’ అంటూ ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా సోనూసూద్ పోస్ట్ కు నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. “గొప్ప కొడుకును కన్నా మీకు ధన్యవాదాలు, ఇతరులకు సహాయం చేసే గుణం మీ నుండే వచ్చినట్టుంది”అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version