ఎట్టకేలకు విజయ్ తనయుడు ఇంటికి వచ్చాడు..

తమిళ్ హీరో విజయ్ కుటుంబ సభ్యులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. విజయ్ కుమారుడు జాసోన్ చదువు నిమిత్తం కెనడాకు వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. కొన్ని నెలలుగా లాక్‌డౌన్ విధించడంతో పాటు విదేశాల నుంచి విమానాలను నిలిపివేయడంతో జాసోన్‌ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

దీంతో తన కుమారుడు ఎప్పుడు వస్తాడో అని విజయ్ కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్నారు. ఇక ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా విదేశాలలో ఉన్న భారతీయులు ఇటీవల దేశానికి వస్తుండగా.. జాసోన్ కూడా వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు ఓ హోటల్‌లో క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న జాసోన్ ఇటీవలే ఇంటికి వెళ్లారు. దీంతో విజయ్ కుటుంబం సంతోషంలో నిండిపోయింది.