మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా సోషల్ మీడియా లో సినీ స్టార్స్ , అభిమానులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భర్త రామ్ చరణ్ .. తన శ్రీమతికి సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేస్తూ.. దయా హృదయంతో నువ్వు చేసే పనులు చిన్నవైన ఎప్పటికీ వృధాకావు. రివార్డులు వచ్చిన కూడా నీ పనులని ఇలానే కొనసాగిస్తావని ఆశిస్తున్నాను.. హ్యాపీ బర్త్‌డే అంటూ చరణ్ తెలిపాడు.
2012 జూన్ 14న రామ్‌చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నారు. ఇటీవలే వీరి వివాహ బంధానికి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన సోషల్ సర్వీస్‌కి సంబంధించిన ఫోటోలు, తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫోటోలు, చెర్రీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. View this post on Instagram
A post shared by Ram Charan (@alwaysramcharan) on Jul 19, 2020 at 10:17pm PDT