ఇంతకీ మీ ధైర్యం ఏంటి ముద్దుగుమ్మలు?

సినీ పరిశ్రమలో వరుసగా హిట్‌లు పడితే ఇక పారితోషికాన్ని అమాంతం పెంచేస్తారు. విజయాలు అందుతున్నా కొద్దీ నిర్మాతలు కూడా ఎక్కువ వెచ్చించి హీరోయిన్లను, హీరోలను బుక్‌ చేసుకుంటారు. ఒకసారి అలవాటు పడిన తర్వాత మళ్లీ పారితోషికాన్ని తగ్గించాలంటే అది ఎంత కష్టమో. డబ్బు అంటే ఎవరికైనా మమకారం ఎక్కువే కదా. ముందుగా ఎక్కువ లాగించి ఆ తర్వాత తగ్గించమంటే ఎలా. కానీ ఎవరో కొందరు ఇక తప్పని పరిస్థితి అనుకున్నప్పుడు మాత్రమే మునుపు తీసుకున్న ముడుపు కంటే కాస్త తగ్గించి అవకాశాల కోసం వెంపర్లాడుతారు. కానీ తెలుగులో ఉన్న ముగ్గురు హీరోయిన్‌లు మాత్రం అవకాశాలు లేకున్నా సరే అమౌంట్‌ తగ్గించేది లేదు, వస్తేనే రండి అన్నట్టుగా ఉన్నారు.

చిరుతో రొమాన్స్‌ చేసి ‘ఖైదీ నె. 150’తో మంచి సక్సెస్‌ను అందుకున్నా కూడా ఆ తర్వాత కాజల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు. చిరుతో నటించడానికి ఈ అమ్మడు బాగానే డిమాండ్‌ చేసింది. తర్వాత హిట్‌ పడినా కూడా అవకాశాలు రాలేదు, అమౌంట్‌ తగ్గించడం లేదు. ‘బాహుబలి’ చిత్రంలో అవంతికగా నటించిన తమన్నా పరిస్థితి కూడా సేమ్‌. మొదటి పార్టు పర్వాలేదనిపించినా కూడా రెండో పార్టులో ఈ అమ్మడిది ఏం లేదు, ఇక అవకాశాలు కూడా అసలే లేవు, అయినా పారితోషికం తగ్గించడం లేదు.

ఇకపోతే ‘బాహుబలి’ చిత్రంలో దేవసేనగా నటించిన అనుష్క చేతిలో కూడా కొత్త ప్రాజెక్ట్‌లు ఏమి లేవు, పైగా సైజు పెరగడంతో గ్లామర్‌ పాత్రలు ఆమె దరి చేరడం లేదు, అయినా రెమ్యునరేషన్‌ తగ్గించడం లేదు. ఈ ముగ్గురు హీరోయిన్‌ల చేతిలో అవకాశాలే లేవు అయినా కూడా పారితోషికం విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇంతకి వీరి ధైర్యం ఏంటో మరి. ఎలాగైనా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారేమో కానీ ఇటీవల కొత్త పిల్లలకు డిమాండ్‌ కూడా చాలా పెరిగింది. కాస్త జాగ్రత్త పడండి ముద్దుగుమ్మలు లేకపోతే ఇక సినీ పరిశ్రమకు కరువైతారు.