Site icon TeluguMirchi.com

ఆసుపత్రి లో చేరిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ..

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆసుపత్రి లో చేరడం అందరిని షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీనిబారిన సినీ స్టార్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే పడుతున్నారు. ఈ నేపథ్యంలో పృథ్వీ ఆసుపత్రి లో చేరడం చర్చ గా మారింది.

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం త‌న‌కి కావాల‌ని కోరారు. గ‌త ప‌ది రోజులుగా జ‌లుబుతో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నారు పృథ్వీరాజ్. క‌రోనా టెస్ట్‌లు రెండు సార్లు చేయించినప్ప‌టికీ నెగెటివ్ వ‌చ్చింద‌ని అన్నారు. అయితే  టెస్టుల్లో   నెగెటివ్ అని వచ్చినప్పటికీ ఓ 15 రోజులు క్వారంటైన్‌లో ఉండాల‌ని డాక్ట‌ర్స్ చెప్ప‌డంతో నిన్న అర్ధ‌రాత్రి ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు వీడియో ద్వారా తెలియ‌జేశారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Comedian <a href=”https://twitter.com/hashtag/Prudhviraj?src=hash&amp;ref_src=twsrc%5Etfw“>#Prudhviraj</a> undergoing treatment for sickness and wishing all your prayers for his sppedy recovery. <a href=”https://t.co/9RwCLmFH2z“>pic.twitter.com/9RwCLmFH2z</a></p>&mdash; Vamsi Shekar (@UrsVamsiShekar) <a href=”https://twitter.com/UrsVamsiShekar/status/1290561937521233925?ref_src=twsrc%5Etfw“>August 4, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script> 

Exit mobile version