Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం..మంగళవారం కేసుల సంఖ్య ఎంతంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం తో ప్రజలు భయాందోళనలో బ్రతుకుతున్నారు. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో ఒకే రోజు ఏకంగా 62 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 37,162 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 4,944 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 58,668కు చేరింది.

జిల్లాలవారీగా కేసులు సంఖ్య చూస్తే..

పశ్చిమ గోదావరి జిల్లాలో 623 కేసులు , గుంటూరు జిల్లాలో 577, అనంతపురం జిల్లాలో 458, చిత్తూరులో 560, తూర్పు గోదావరిలో 524, కడపలో 322, కృష్ణా జిల్లాలో 424, నెల్లూరులో 197, ప్రకాశంలో 171, శ్రీకాకుళంలో 133, విశాఖపట్నంలో 230, విజయనగరంలో 210, కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 7,756 కేసులు నమోదు కాగా, తర్వాత కర్నూలు జిల్లాలో 7,119 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version