అప్పుల బాధతో సీరియల్ నటి ఆత్మ హత్య..

ఇటీవల కాలంలో చిత్రసీమ లో వరుస మరణాలు ఇండస్ట్రీ ని షాక్ కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు పలు కారణాలతో మరణించగా..తాజాగా అప్పుల బాధతో సీరియల్ నటి ఆత్మ హత్య చేసుకోవడం వార్తల్లో హైలైట్ అయ్యింది. గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి టీవీ సీరియల్ లలో నటించింది.. ఆతరవాత అవకాశాలు రాకపోవడం తో గుంటూరు వెళ్ళింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు.

అనంతరం చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. విద్యానగర్ లో నివాసం ఉంటున్న రేఖ కొన్ని రోజులపాటు వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ లాంటివి చేసారు. ఈ క్రమంలో ఆమె భర్త చైతన్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో అతడికి రియల్ ఎస్టేట్ లో నష్టాలు రావటం, ఆమెకు అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా నష్టాలపాలవడంతో రేఖ కుంగిపోయారు. దాంతో నిన్న స్నానం చేసేందుకు వెళ్లి బాత్రూములోనే ఆత్మహత్య చేసుకున్నారు. భార్య ఎంతకీ బయటకు రాకపోవటంతో ఆమె భర్త బాత్రూం డోర్ ను పగలగొట్టి చూడగా రేఖ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు .