Site icon TeluguMirchi.com

అంగరంగ వైభవంగా నితిన్ – షాలిని వివాహం ..

నితిన్ – షాలిని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జులై 26 న హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ చాలా కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ పాల్గొన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వాదించారు.

ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ..ప్రస్తుతం ‘రంగ్‌ దే’ చిత్రం చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్‌ కథానాయిక. నితిన్‌ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్‌ మ్యారేజ్‌ గిఫ్ట్‌ టు అవర్‌ హీరో’ అంటూ ‘రంగ్‌ దే’ టీమ్‌ టీజర్‌ని విడుదల చేసింది.

Exit mobile version