Site icon TeluguMirchi.com

రివ్యూ : జాంబీ రెడ్డి – తప్పక చూడాల్సిన థ్రిలర్ మూవీ

స్టార్ కాస్ట్ : తేజ స‌జ్జ‌, ద‌క్షా న‌గార్క‌ర్, ఆనంది, పృథ్వీ‌ తదితరులు..
దర్శకత్వం : ప్ర‌శాంత్ వ‌ర్మ‌
నిర్మాతలు: రాజ్‌శేఖ‌ర్ వ‌ర్మ‌
మ్యూజిక్ : మార్క్ కె. రాబిన్‌
విడుదల తేది : ఫిబ్రవరి 05, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్ చేసిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. తేజ స‌జ్జా, ఆనంది, దక్ష హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే ఇండస్ట్రీ పెద్దల సలహా మేరకు సినిమాను పోస్ట్ పోన్ చేసి ఈరోజు రిలీజ్ చేసాడు. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో, కరోనా నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది చూస్తే..

కథ :

ఓబుల్‌ రెడ్డి(తేజ సజ్జ) గేమ్ డిజైనర్. తన తెలివికి తన స్నేహితులు తోడవడం తో సరికొత్త గేమ్ లను రూపొందిస్తు పేరు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో గేమ్ ప్రొగ్రమింగ్ లో చిన్న ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ను కరెక్ట్ చేయడం లో కిరణ్ (హేమంత్‌) దిట్ట. కానీ అతడు తన పెళ్లి కోసం కర్నూల్ లో ఉంటాడు. దీంతో ఓబుల్‌ రెడ్డి తన ఫ్రెండ్స్ కిరణ్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఓ పెద్ద సమస్య లో పడతారు. మరి ఆ సమస్య ఏంటి..? అక్కడ మనుషులు జాంబీలుగా ఎందుకు మారతారు..? జాంబీలు చేతిలో నుండి ఓబుల్‌ రెడ్డి అండ్ తన ఫ్రెండ్స్ ఎలా బయటపడతారు..? నందినీ రెడ్డి ఎవరు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

బాల నటుడి గా ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న తేజ..ఇప్పుడు హీరోగా ఈ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన పాత్ర కు 100 శాతం న్యాయం చేసాడు. నేటి తరం కుర్రాడిగా, గేమ్‌ డిజైనర్‌గా చక్కగా నటించాడు.

సాంకేతిక వర్గం :

ఫస్ట్ హాఫ్ మాములుగా నడిపించిన..ఇంటర్వెల్ లో జంబిలను ప్రవేశ పెట్టి సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి నింపారు. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ దగ్గరి నుండి చివరి వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేసి సక్సెస్ అయ్యాడు.

ఫైనల్ గా.. ప్రశాంత్‌ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్‌, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హెలైట్‌ గా నిలిచింది. తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్త రకం సినిమా ఈ ‘జాంబి రెడ్డి’.

Exit mobile version